ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ హెచ్చరించారు. మంగళవారం ఖానాపూర్ పట్టణ శివారులోని రెంకొని వాగు వద్ద నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, ఒక జెసిబిని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించామని ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ తెలిపారు. అక్రమంగా ఇసుక మొరం తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.