ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు వరద కొనసాగుతుందని మంగళవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699. 875అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 777 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చి చేరగా లెఫ్ట్ రైట్ కెనాల్ లకు 886 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.