ఖానాపూర్ లో భారీ వర్షం నమోదు

61பார்த்தது
ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో భారీ వర్షం పడుతోంది. సోమవారం ఉదయం నుండి ఖానాపూర్ పట్టణంతో పాటు ఆ మండలంలోని పలు గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. దాదాపు రెండు గంటలుగా భారీ వర్షం పడుతోంది. మండలంలోని పలు గ్రామాల రైతులు భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు పలు పంటలు వేసిన వర్షాలు లేకపోవడంతో విత్తనాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలు పంటలను కాపాడాయన్నారు.

தொடர்புடைய செய்தி