రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించాలి

81பார்த்தது
రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించాలి
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీలో భాగంగా గురువారం మొదటి విడత రూ. లక్ష రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాలలో వారు రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி