విమర్శలు చేస్తే సహించేది లేదు

78பார்த்தது
విమర్శలు చేస్తే సహించేది లేదు
రాష్ట్ర మంత్రి సీతక్కపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి విమర్శలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బి. గోవింద నాయక్ అన్నారు. గురువారం ఖానాపూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క కృషి చేస్తున్నారన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తోందని తెలిపారు. మంత్రి సీతకపై విమర్శలు చేయవద్దని కోవలక్ష్మికి ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி