సీఎం రేవంత్‌ను కలిసిన హైదరాబాద్ నూతన పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్‌ (వీడియో)

82பார்த்தது
హైదరాబాద్ నూతన పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. రెండోసారి హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ హైదరాబాద్ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, నగరంలో లా అండ్ ఆర్డర్‌ను మరింత మెరుగుపరుస్తామన్నారు.

தொடர்புடைய செய்தி