సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలోని హాస్టల్ లో బాత్రూంలు, సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినిలు సమస్యను పరిష్కరించాలని స్కూల్ వార్డెన్ దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్లిన ఫలితం లేకపోగా బెదిరిస్తున్నారని విద్యార్థినిలు వాపోతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.