జెనివాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నవంబరు 4న నిర్వహించే ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవ సమావేశంలో పాల్గొనడానికి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామానికి చెందిన మారోజు బ్రహ్మచారికి ఆహ్వానం అందింది. ప్రపంచ దేశాల ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొననున్నారు. సునామీ వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తదితర అంశాలపై ప్రతినిధులకు అవగాహన కల్పిస్తారని శుక్రవారం బ్రహ్మచారి తెలిపారు.