సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామంలోని అన్నారం, తిమ్మాపురం రోడ్డు అధ్వానంగా తయారైంది. నిత్యం వందలాది వాహనాలు ఈ రోడ్డుపై తిరుగుతుంటాయి. తేలికపాటి వర్షానికి రోడ్డుపై నీరు చేరి ప్రయాణికులకు, వాహనదారులకు, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి తక్షణమే ఈ రోడ్డును మరమ్మతు చేయవలసిందిగా స్థానిక రైతులు, వాహనదారులు, ప్రయాణికులు శనివారం కోరుతున్నారు.