ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలి
మంగళవారంలోగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయిన చోట లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని చెప్పారు.