రామ్‌లీలా నాటకంలో కొట్టుకున్న రాముడు, రావణ పాత్రధారులు (వీడియో)

56பார்த்தது
యూపీలోని అమ్రోహా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. రామ్‌లీలా నాటకంలో పాత్ర ధారులైన రాముడు, రావణుడు కొట్టుకున్నారు. దసరా సందర్భంగా గజ్రౌలా పిఎస్ పరిధిలోని సేలంపూర్ గొన్సాయి గ్రామంలో రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలోని పాత్రదారులు తొలుత ఒకరిపై ఒకరు బాణాలు వేసుకున్నారు. ఆ తర్వాత రాముడి పాత్రధారుడ్ని రావణ పాత్రధారుడు స్టేజ్‌ నుంచి కిందకు తోశాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య కోట్లాట జరిగింది. ఈ వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

தொடர்புடைய செய்தி