ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఈ మధ్య బలంగా వినిపిస్తోంది. దీనివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగిపోవడంవల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ తగ్గడంవల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.