తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం నల్గొండ మండలం కమిటీ సమావేశం దొండ కృష్ణారెడ్డి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలం చెందుతుందని అన్నారు.