రాష్ట్రంలో విద్యారంగం గాడి తప్పిందని, ప్రభుత్వం సంక్షేమరంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మేస్, కాస్మటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ఒకరోజు దీక్షను చేపట్టారు. ఈ దీక్ష కు మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లక్ష్మి నారాయణ పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు.