ఎం జి యు ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ అధ్యాపకులతో రాబోవు నాక్ అక్రిడిషన్ ఏ గ్రేడ్ సాధనకు అధ్యాపకుల పాత్ర పై దిశా నిర్దేశం చేశారు. సోమవారం నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అధ్యాపకులు సమయపాలన, బోధన పరిశోధన పై దృష్టి సారించి విద్యార్థులలో క్రమశిక్షణ, జిజ్ఞాసను పెంపొందించే ప్రయత్నం చేయాలన్నారు.