ఎన్ జి కళాశాల అర్థశాస్త్ర విభాగంలో డిసెంబర్ 20, 21 తేదీలలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. ఎస్.ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం సదస్సు బ్రోచర్ ను తమ కార్యాలయంలో ఇతర అధ్యాపకులతో కలిసి విడుదల చేశారు. స్థిరమైన అభివృద్ధి - అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై జరిగే ఈ జాతీయ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాల నుండి అకాడమిషియన్లు, ఆర్థికవేత్తలు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొననున్నారు.