డిసెంబర్ 2, 3, 4వ తేదీలలో సీపీఎం నల్లగొండ జిల్లా 21వ మహాసభలు మిర్యాలగూడలో జరుగుతున్నాయని, రెండో తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, దానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మండల కార్యదర్శి పెంజర్ల సైదులు ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. మహాసభలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను చర్చించడం జరుగుతుందన్నారు.