దశాబ్దాల పాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధికి మార్గ సూత్రాలు రూపొందించకుండా కాంట్రాక్టు కమిషన్ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ విధ్వంసం చేశాడని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు. ఈ నెల 9న నల్గొండలో జరిగే తెలంగాణ జన సమితి జిల్లా ప్లీనరీ పునస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్లో మాట్లాడారు.