స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు.