ఈనెల 16 నుండి 19 వరకు నిర్వహించనున్న సయ్యద్ లతీప్ ఉల్లా షా ఖాద్రి ఉర్స్ ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రి ఉర్సు ఉత్సవాలపై మంగళవారం అయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఉత్సవానికి వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.