చికిత్స పొందుతూ 5 నెలల బాబు మృతి

8893பார்த்தது
నకిరేకల్ మండలం మంగళపల్లికి చెందిన చింత రాంబాబు - పవిత్ర ల కుమారుడు లక్కీ (5నెలలు) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో నల్గొండ పట్టణం రామగిరిలోని ఓ పిల్లల హాస్పిటల్లో చేర్పించారు. శనివారం చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. దీనికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. టూ టౌన్ ఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకొని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி