తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను నందికొండ మున్సిపాలిటీ 12వ వార్డులో ప్రారంభించారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి శుక్రవారం పైలాన్ కాలనీ బస్టాండ్ నందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.