దసరా పండగను పురస్కరించుకుని సర్కిల్ పరిధిలో లాటరీ పేరుతో 100 కొట్టు మేకను పట్టు, 200 కొట్టు ఖరీదైన మద్యం పట్టుకుపో అంటూ ప్రజలను మోసం చేస్తూ అక్రమ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ జనార్ధన్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. లాటరీ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని ప్రజలు ఇలాంటి మోసపూరిత స్కీములకు ఆకర్షితులు కావొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.