పెద్దవూర మండలం కొత్తలూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామవీధుల్లో పర్యటించి కావాల్సిన అభివృద్ధి పనులను మంజూరు చేయడంతో పాటు పరిపాలన యంత్రాంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న కుంటి గొర్ల మహేష్ యాదవ్ కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం కల్పించారు.