మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల్లోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, డిండి ఎత్తిపోతలకు డిపిఆర్ ను ఆమోదించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీశైలం అన్నారు. సోమవారం శివన్న గూడెంలో జరిగిన సిపిఎం శాఖ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.