మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డుకు చెందిన రమావత్ చిన్న సోమవారం ఉదయం ఏడు గంటలకు స్వర్గీయులు అయినారు. ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రామకృష్ణ, ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆంగోతు చక్రీ నాయక్ వారి పార్థివ దేహానికి పూలమాల లేసి నివాళి అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.