ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం 44వ వార్డ్ సీతారాంపురంకి చెందిన కీర్తిశేషులు గుడుగుంట్ల వెంకటేశ్వర్లుకు మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో 60, 000 సీఎం సహాయ నీది చెక్కును అందించారు. 44వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పర్శనబోయిన సంతోష్ కలిసి గుడుగుండ్ల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు.