దేవరకొండ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై వివక్ష చూపిందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న డిప్యూటి సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ లు ఎస్సెల్బీసి టన్నెల్ పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. ఈ పర్యటనతో జిల్లాలో ప్రాజెక్టుల దశ మారనుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.