పీఏ పల్లి స్థానిక సమస్యల పరిష్కారానికి సిపిఎం శ్రేణులు ఉద్యమించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను మతం పేరుతో రెచ్చగొడుతూ, పేదల దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుందని అన్నారు. ఈ సమావేశంలో దేవయ్య, దానయ్య, రత్నం, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.