దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండ పట్టణ పరిధిలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయాన్ని సందర్శించి, శ్రీ శ్రీ దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తల్లి ఆశీస్సులు ఎల్లపుడూ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే బాలు నాయక్ ఆకాంక్షించారు.