బీబీనగర్: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
బీబీనగర్ లోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న ఎరుకల మహేష్ (28) ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లికి పెన్షన్ రావడంతో ఆ డబ్బులను తన ఖర్చులకు వాడుకోవడంతో తల్లి కొడుకుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన మహేష్ శనివారం సమీపంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.