నాగర్కర్నూల్: గర్భవతి హత్య?
వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని కన్పించింది. గ్రామస్తులు వివరాల ప్రకారం.. పానగల్ (ఎం) చిక్కేపల్లికి చెందిన బాలకృష్ణతో వివాహమైంది. నాగర్కర్నూల్ జిల్లాకి చెందిన ప్రశాంతి (21) భర్త వేధింపులకు పుట్టింటిలోనే ఉంటుంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్త కొట్టి ఉరేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతి గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.