బిజినేపల్లి మండలం మంగనూరు, లట్టుపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లాఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ , కలెక్టర్ బాదావత్ సంతోష్ లు తనిఖీ చేశారు. కొనుగోలు జరిపిన 48 గంటల్లోపే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దళారులకు అమ్మి రైతులు ఎవరు కూడా మోసపోవద్దని సూచించారు.