నవంబర్ 19 నుంచి డిసెంబర్ 7 వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జెండా ఊపి కళాయాత్ర వాహనాన్ని ప్రారంభించారు. 20 మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.