వెల్దండ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, టాయిలెట్లు, ఆఫీస్, స్టాఫ్ రూమ్ లు తదితర వాటిని పరిశీలించారు. బీసీ బాలుర వసతి గృహాన్ని కలియతిరిగి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిశుభ్ర వాతావరణంలో వండించి ఇవ్వాలని హాస్టల్ సంక్షేమాధికారిని ఆదేశించారు