సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి అలసత్వం లేకుండా 100% పకడ్బందిగా చేపట్టాలని తిమ్మాజీపేట మండలం ప్రత్యేక అధికారి డీఈఓ గోవిందరాజులు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. బుధవారం తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామంలో 480 కుటుంబాలు ఉన్నాయని, ఇప్పటివరకు 330 కుటుంబాల సమగ్ర సర్వే నిర్వహించారు. మిగిలిన 115 ఇండ్లను సర్వే చేసి ఆన్లైన్ నమోదు ప్రక్రియను సజావుగా పూర్తి చేయించాలని సూచించారు.