ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్‌ఈజీఎస్) ద్వారా రూ.4,500 కోట్లతో 30 వేల పనులు చేపడుతాం. సంక్రాంతి లోపు ఆ పనులు పూర్తి చేస్తాం. గతంలో జరిగిన ఉపాధి పథకం నిధుల మళ్లింపుపై విచారణ చేయిస్తున్నాం. జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. సాగు పనులకు ఉపాధి హామీకి అనుసంధానంపై పరిశీలిస్తాం.’ అని అన్నారు.