జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కాలనీలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. భేతి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి 3 నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన స్కూటీని కొనుగోలు చేశారు. శుక్రవారం ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్కి ఛార్జింగ్ పెట్టారు. ఒక్కసారిగా స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. స్కూటీ కాలిపోగా, ఇంటి తలుపులు దగ్ధమయ్యాయి.