ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తూర్పు గోదావరి జిల్లాల్లో వేమగిరి నుంచి సామర్లకోట వరకు 62 కి.మీ. రోడ్డును హైవేగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు పంపించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటికే కాకినాడ పోర్టుకి 2 రోడ్లు ఉండగా.. మూడో ప్రత్యామ్నాయ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టతనిచ్చింది. దీని వల్ల సామర్లకోట-రాజమండ్రి మధ్య ఉన్న టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతున్నారు.