బీహార్లోని నలంద జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు అరెస్ట్ అయ్యారు. గుల్ని గ్రామంలో ప్రిన్సిపాల్ నాగేంద్రప్రసాద్, కాంట్రాక్టు ఉపాధ్యాయుడు సుబోధ్కుమార్లు మద్యం సేవించి పాఠశాలకు వెళ్లారు. ఇది గమనించిన అక్కడి యువకులు వారితో గొడవపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో యువకులు, గ్రామస్థులపై వారిద్దరూ దుర్భాషలాడారు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.