జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సోషల్ ఆడిట్ ను కోడేరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు కోడేరు మండలంలోని 22 గ్రామపంచాయతీ పరిధిలో రూ. 2, 71, 87000 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు చేపట్టారు. పనులు జరిగిన ప్రదేశాలు, కూలీలకు చెల్లింపులపై సామాజిక తనిఖీ కార్యకర్తలు ఈనెల 11 నుంచి 20 వరకు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు.