ప్రతి ఒక్కరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సూర్య ప్రకాష్ రావు గంట గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సూర్యప్రకాష్ రావు కోరారు. శుక్రవారం వెల్దండ మండలం రాచూరు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఓటును తమకే వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నానని అలాంటి వ్యక్తులను మాత్రమే నమ్ముకుని ఓట్లు వేయాలని కోరారు.