ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. సీఎం ఎంపిక విషయంలో కీలక నేతలతో విస్తృత సంప్రదింపులు జరిపి ఢిల్లీ సారథి ఎవరో తేల్చనున్నారు.