హైదరాబాద్‌లో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో అద్భుత దృశ్యం కనిపించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూ సంఘాల ఆధ్వర్యంలో గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చేరుకోగానే స్థానిక ముస్లింలు స్వాగతం పలికారు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు మతసామరస్యానికి ప్రతీక అని కొనియాడారు.