అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించిన ఎంపీ ఈటల

55பார்த்தது
అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించిన ఎంపీ ఈటల
TG: అర్చకులపై దాడి చేయడం అమానుషమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం పూజారి రంగరాజన్‌ను శనివారం ఆయన పరామర్శించారు. రంగరాజన్‌పై దాడిని సభ్య సమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. పూజారులపై దాడులు చేయడం మన సంస్కృతి కాదు.. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రంగరాజన్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி