యూపీలోని ఖుషీనగర్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన అమాయకపు కుమార్తెను శిథిలావస్థలో ఉన్న భవనంలో వదిలి పారిపోయింది. భవనంలో బాలిక ఏడుపు విని, ఆరోగ్య కార్యకర్తలు అక్కడికి చేరుకుని వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పాపకు దాదాపు 4 నుంచి 6 నెలల వయసు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిన్నారి తల్లి కోసం అధికారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.