తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం పట్ల చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఏపీలో 25 పార్లమెంట్ స్ధానాలకు గానూ ఎన్డీయే కూటమి 21 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 175 అసెంబ్లీ స్ధానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్ధులు 160 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.