భారత వాతావరణశాఖ (IMD) 150 ఏళ్ల వేడుకను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ‘మిషన్ మౌసం’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా ఐఎండీ విజన్-2047 పత్రాన్ని, స్మారక నాణేన్ని విడుదల చేశారు. వాతావరణ ప్రక్రియపై అవగాహనను మెరుగుపరచడం, నిర్వహణ, గాలి నాణ్యత డేటాను అందించడంపై మిషన్ మౌసం దృష్టి సారిస్తుందని మోదీ పేర్కొన్నారు.