కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. రాజకీయం చేయడం కోసమే బీజేపీ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. ఒక రోజు కాదు.. మూడు నెలలు నిద్ర చేస్తే నిరుపేదల బాధలు ఏంటో తెలుస్తాయని మండిపడ్డారు. 3 నెలలు బస్తీల్లోనే ఉంటే ఏం చేయాలో బీజేపీ నేతలే నిర్ణయిస్తారని అన్నారు. కాగా, 'పేదవాళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కిస్తారా.. వేల ఇళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చుతారా' అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.