తెలంగాణ సీఎం రేవంత్‌పై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీని గాడ్సేతో పోల్చారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలను మంత్రి సత్యకుమార్ ఖండించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్థ సీఎం రేవంత్ అంటూ మండిపడ్డారు. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.